మహిళలు తిరగబడడమే మన ముందున్న కర్తవ్యం.
Nalgonda
__పాలడుగు ప్రభావతి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
ఆట వస్తువులుగా రెండవ పౌరురాలుగా చూస్తూ ముక్కలుగా నరికి వేస్తున్న పట్టించుకునే నాధుడే లేడని 5వ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు ఈ రోజు ఐద్వా ఆధ్వర్యంలో హాలియా పట్టణ కేంద్రంలో మహిళలు దాడులు ప్రతిఘటన పై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రభావతి మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పిస్తామని నేటికి అమలు చేయకపోవడం మన పాలకుల దౌర్భాగ్య పరిస్థితి అన్నారు. మహిళలు చట్టాలు పగడ్బందీ విధానాలు రూపొందించడంలో బూర్జువా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళలు చట్టసభలలో ప్రవేశించినప్పుడే కఠినమైన చట్టాలు అమలు జరిగేందుకు దోహదపడ ఉందని అన్నారు. నేడు విద్యార్థినిల చదువులో విజ్ఞానం కు ఉపయోగపడే విద్యా అందించకుండా మూఢనమ్మకాలు జ్యోతిష్యము బోధిస్తున్నారని చరిత్రను వక్రీకరిస్తూ యువతను తప్పుదోవ పట్టించడానికి నేటి పాలకులే కారణమని అన్నారు. మద్యం ఏరులై పారుతుందని అశ్లీలత నీలి చిత్రాలు గూగుల్ పై నియంత్రణ లేకపోవడం వలన యువతి యువకులు చెడు మార్గం పట్టడానికి ఒక వేదిక అయిందని అన్నారు ప్రభుత్వాలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో మహిళల భద్రత కొరకు కాలేజీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐదవా జిల్లా సహాయ కార్యదర్శి కారంపూడి ధనలక్ష్మి రామకృష్ణా రెడ్డి పద్మ జ తదితరులు పాల్గొన్నారు..
హాలియా నల్లగొండ జిల్లా
కారంపూడి ధనలక్ష్మి.