మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న మహిళబంధు కార్యక్రమంమహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న మహిళబంధు కార్యక్రమం

మహిళల్లో చైతన్యం పెంపొందించుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీటీసీ సాయిని విజయ ముత్యం అన్నారు. ఆదివారం గోరి కొత్తపల్లిలో స్థానిక సర్పంచ్ సుధనబోయిన రజిత రాజయ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న మహిళబంధు కార్యక్రమానికి జడ్పీటీసీ సాయిని విజయ ముత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గంలో మహిళా బంధు పేరిట 6,7,8 వ తేదీల్లో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో,గ్రామాలాలో సంబరాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. గోరి కొత్తపల్లి మండల కేంద్రంగా మొదటగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోన సమయంలో శానిటేషన్ సిబ్బంది సేవలు మరలేనివని కొనియాడారు. తెరాస పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు. 50 వేలతో ప్రారంభమైన కళ్యాణలక్ష్మి పథకం నేడు రూ.1లక్ష 116 అందచేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షలకు పైగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు అందచేయడం జరిగిందన్నారు. ఇప్పటికే మహిళలపై తెరాస ప్రభుత్వం రూ.9022 కోట్లకు పైగా వెచ్చించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో బాలికలకు ప్రత్యేక గురుకుల విద్యాలయాలు ఏర్పాటుచేసి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న ఘనత కేసీఆర్ దన్నారు. అదేవిదంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్లు, మహిళ స్వయం సంఘాలకు రూ.10లక్షల లోపు వడ్డీలేని రుణాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. అంగన్వాడీలకు, ఆశావర్కర్స్ కు రెండు సార్లు వేతనాలు పెంచడం జరిగిందన్నారు. చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 8వేల వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి షీ టీమ్ లను, సఖి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ, ఆశాలు, గ్రామపంచాయతీ మహిళా సిబ్బందిని శాలువాతో సత్కరించారు. మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ హమీద్, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు రఘుసాల తిరుపతి, యూత్ అధ్యక్షులు నేరెళ్ల బిక్షపతి, యువజన నాయకులు విష్ణు, పిఎసిఎస్ డైరెక్టర్ ఆవుల మహేందర్, సోషల్ మీడియా కన్వీనర్ సామ్రాట్, కో కన్వినర్ నిమ్మల రాజు, సర్పంచ్ లు పాతపల్లి సంతోష్, ఐలయ్య, దేవునూరి ప్రణీతశ్రీనివాస్, గుండు బుచ్చమ్మ, లింగంపల్లి శ్వేతరాజు, చిగురుమామిడి రజితరాజు, ఎంపీటీసీలు బొట్ల కవిత, గండు కుమార్, తెరాస నాయకులు కానుగంటి శ్రీనివాస్, వీరేశం, బొట్ల లక్ష్మణ్, బట్టు శ్రీనివాస్, పకీడే నవీన్, తెరాస మహిళా విభాగం మండల అధ్యక్షురాలు శైలజా రెడ్డి, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, మహిళా సంఘం నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News