మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పండ్ల పంపిణీ
పర్వతగిరి మండల కేంద్రంలో మాజీ భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్బంగా దేశానికి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వృద్ధులకు పండ్లు పంపిణీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్,జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు చేసినారు.ఈ సందర్బంగా పిన్నింటి అనిల్ రావుమాట్లాడుతూ భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశంలో సమాచార సాంకేతిక రంగం, టెలికాం విప్లవానికి ఆయన బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతు ప్రపంచ దేశాల తో పోటీ పడేలా భారత దేశాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో దేశ యువతకు దారి చూపిన నాయకుడు దివంగత రాజీవ్ గాంధీ .
దేశంలో టెలికాం యుగానికి నాంది పలికి,కంప్యూటర్ & సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి.
భారత్‌ను 21వ శతాబ్దంలోకి ముందుకు నడిపించి,మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించి ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటి వర్ధలా కోసం యెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ
ఎన్నో విప్లవాత్మక మార్పులతో దేశ ప్రగతికి మార్గదర్శకుడిగా నిలిచిన గొప్ప దార్శినికుడు రాజీవ్ గాంధీ అని అన్నారు.దేశ ప్రగతి కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబనికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు సైనికులుగా మారి రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయలాని పిలుపునిచ్ఛారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు చిదురు శంకర్, గడిపెల్లి మహేందర్,దారమ్సోత్ తిరుపతి,గడుధుల రవి యాధవ్,ఉప సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు,దేవస్థాన డైరెక్టర్లు, ప్యాక్స్ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలుతధితరులు పాల్గొన్నారు.