‘మిషన్ 10వ తరగతి’ పోస్టర్ ఆవిష్కరణ
టేకుమట్ల మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన ‘మిషన్ 10వ తరగతి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టేకుమట్ల ఎస్సై సుధాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిడిరాల సుధాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కాల్వ శ్రీరాంపూర్ బ్రాంచ్ మేనేజర్ బుర్ర అఖిల్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పూదరి శివప్రసాద్, బేతురాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన ‘మిషన్ 10వ తరగతి’ కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని,ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు గొప్ప ప్రోత్సాహమని పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.2.2 కోట్ల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానానికి రూ.5 లక్షలు, ద్వితీయ స్థానానికి రూ.3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్‌కు రూ.2 లక్షలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల టాపర్లకు రూ.1 లక్ష చొప్పున, అలాగే 612 మండలాల టాపర్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు.ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న, 2026 మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపారు