ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలి
Bhadradri Kothagudemసెక్టార్లకు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22వ తేదీ సాయంత్రం తెప్పోత్సవం, 23వ తేదీ ఉదయం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలు వీక్షణకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారుల ఆదేశించారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులు సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. గోదావరి లోతును తెలియజేయు విధంగా ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 22వ తేదీన నది ఐలాండ్లో బాణాసంచాలు కాల్చటలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. భద్రాచలం విచ్చేయు భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందించడానికి వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. దేవస్థానం, స్నానాల ఘాట్ వంతెన, కరకట్టలను విద్యుద్ధి కరణ చేయాలని చెప్పారు. మొత్తం మండపాన్ని 7 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్ కు బారి కేడింగ్ చేయాలని చెప్పారు. భద్రాచలం వచ్చే భక్తులకు సమాచారం అందించేందుకు ప్రధాన కూడళ్ళలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. 22, 23 రెండు రోజులు అత్యంత ముఖ్యమైన రోజులని అధికారులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సురక్షిత మంచినీరు, ఆహార పదార్థాలను తనిఖీ చేయాలని మిషన్ భగీరథ, పౌరసరఫరాలు, ఆరహార తనిఖీ అధికారులను ఆదేశించారు. తెప్పలోనికి. అనుమతించే వ్యక్తులకు పాసులు జారీ చేయాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని డిపివోకు సూచించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భక్తులకు సురక్షిత మంచినీరు అందించేందుకు
ఏర్పాట్లు చేయాలని, మంచినీటి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. లాంచ్ యొక్క పటిష్టతను తనిఖీ చేసి ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరణ నివేదిక అందచేయాలని చెప్పారు. మన జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పర్ణశాలకు కూడా అదుపు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రాచలం బస్టాండ్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బస్టాండ్ పరిశుభ్రంగా ఉంచాలని అదనపు సిబ్బంది ఏర్పాటు ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపెట్టాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అత్యవసర చికిత్స కేంద్రాలు ఏర్పాటుతో పాటు తగినన్ని మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాదికారికి సూచించారు. దేవాలయ పరిసరాల్లో ఆరు అత్యవసర వైద్య చికిత్సా కేంద్రాలు ఏర్పాటుతో పాటు 25 మంది డాక్టర్లు, 85 మంది పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర సేవలకు బెడ్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. 22, 23 తేదీల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. సమీప రాష్ట్రంలో జిల్లాకు సరిహద్దునున్న ప్రాంతంలో. మద్యం అమ్మకాలు నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే 22, 23 తేదీల్లో మాంసపు విక్రయాలు నిలుపుదల చేయాలని చెప్పారు. పార్కింగ్, ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీవో, పోలీసులు పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సమస్య వస్తే తక్షణమే సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. హోటల్స్ లో తిను బండారాలను తనకి చేయాలని, అధిక ధరలకు విక్రయించకుండా ధరలు నిర్ణయించాలని చెప్పారు.
ఈ సమావేశంలో ఐటిడిఎ పి ఓ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డిఆర్ఓ రవీంద్రనాథ్, దేవస్థానం ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం, దేవస్థానం, తెప్పోత్సవం జరుగు ప్రాంతాలను పరిశీలించారు. చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మండపంలో భక్తులు తిలకించేందుకు ఎల్ ఈ డి టివిలు ఏర్పాటు చేయాలని చెప్పారు.