ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాకతో గులాబీమయంగా మారిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం
Uncategorizedభూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభలో భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు,భూపాలపల్లి ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి కి గౌరవ స్వాగతం పలికిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి,అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్ది శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ…
– భూపాలపల్లి గడ్డమీద అడుగుపెట్టిన మన అందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.
– ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కు గ్రామన్నని జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత వారిది.
– జిల్లా కేంద్రంతో పాటు జిల్లాకు కావలసిన అన్ని మౌలిక మరియు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు.
– ఇటీవలే మన యువ నాయకుడు కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు ఎస్పీ కార్యాలయం ప్రారంభించుకున్నాం.
– గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలోనే మెడికల్ కాలేజ్ వచ్చింది సింగరేణి కార్మికులకు వెయ్యి ఇళ్లను నిర్మాణం జరుపుకున్నాం.
– ముఖ్యమంత్రి ఆశీర్వాదం మన జిల్లాకు ఇంకా ఉంది వారి రాక సందర్భంగా దినదిన అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లిలో స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ యువకులు ఉన్నారు.
– భూపాలపల్లి పట్టణానికి ఐటి టవర్ ఇవ్వాలని భూపాలపల్లి పట్టణానికి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది.
– మండల కేంద్రంగా ఉన్న చిట్యాల లో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.
– నూతన మండలం గా ఏర్పడిన గోరుకొత్తపల్లిలో మండల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న.
– బైపాస్ రోడ్డు పనులకు నిధులు కేటాయించాలి కోరడం జరుగుతుంది.
– ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలంటే భూపాలపల్లి ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్న అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…
– వర్షంలో సైతం వచ్చిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఎన్నికలు వచ్చాయంటే హూ ఇస్ ద రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు నిలిచి ఉంటారు.
– భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలు ఆలోచించాలి ఎవరు నిలుచుంటే ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి జరుగుతుందో ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు ఏర్పడతాయి.
– మన అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారి వ్యక్తిత్వాన్ని చూడాలి,పార్టీలను చూడాలి.
– బిఆర్ఎస్ చరిత్ర మీకు తెలుసు, మీ కళ్ళ ముందే పుట్టిన ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను పరిరక్షించుకునేందుకు తెలంగాణ అభివృద్ధి చేసేందుకే మీ ముందుకు వచ్చింది.
– 15 సంవత్సరాల సుదీర్ఘ రాజులేని పోరాటా అనంతరం తెలంగాణ సాధించుకున్నాం. ఆ తర్వాత అనేక రంగాల్లో మంచి పనులు చేసుకుని గతంలో ప్రధాన సమస్యలుగా ఉన్న మంచినీటి సమస్యలను తీర్చుకున్నాం వ్యవసాయ రంగాన్ని గతంలో కంటే మెరుగ్గా బాగు చేసుకున్నాం పేదల సంక్షేమం కోసం ఆసరా పెన్షన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టుకున్నాం.
– రమణారెడ్డిని గెలిపించి తిరిగి అసెంబ్లీకి పంపిస్తే ఆసరా పెన్షన్లు 5000 వరకు పెరుగుతాయి
– రైతాంగం గురించి ఆలోచించి కూడా కాల్వల ద్వారా కూడా వ్యవసాయ పంటలు పండిస్తే పన్నులు వేసే పరిస్థితి ఉండే 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నాం.
– దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతుబంధు పుట్టించిన దే కేసిఆర్,రైతు మరణించిన వారం రోజుల లోపే ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం.మీరు పండించిన వడ్లను వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నష్టం వాటిలినప్పటికీ నేరుగా కలల వద్దనే ఉంటుంది.
– కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి.
– రేవంత్ రెడ్డి అంటున్న మాటలు ప్రజలు ఒకసారి ఆలోచించాలి కేసీఆర్కు ఏమి పనిలేదు రైతులు కట్టే పనులను తీసుకెళ్లి రైతులకు ఇస్తున్నారు రైతుబంధు వేస్ట్ అని అంటున్నాడు.
– రైతుబంధు కొనసాగాలి మళ్ళీ అంటే రమణారెడ్డి ని గెలిపించి పంపించండి 10000 ఉన్న రైతుబంధును 16000 చేస్తాం.
– రేవంత్ రెడ్డి అంటున్నా మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడు మళ్ళీ వెంకటరమణారెడ్డిని గెలిపించి పంపించండి 24 గంటల విద్యుత్ ఇలాగే కొనసాగుతుంది.
– కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారంట విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించాలి.
– ఇది రైతులకు జ్జీవన్మరణ సమస్య..!!
భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించి గండ్ర వెంకటరమణ రెడ్డి కార్ గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు.వెంకటరమణారెడ్డి చెప్పిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తూచా తప్పకుండా అమలు చేస్తానని ప్రజా ఆశీర్వాద సభ సాక్షిగా తెలిపారు.