ముషీరాబాద్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సమావేశం
ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” అవగాహన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు.ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు మరియు ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, అర్హులైన ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు.సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు మరియు తొలగింపుల ప్రక్రియపై చర్చించారు.ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఓటరు చైతన్యవంతంగా ఉండాలని సమావేశంలో పిలుపునిచ్చారు.