మృతురాలికి నివాళులు అర్పించిన డా.చందుపట్ల కీర్తి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పరుపాటి కేశవ రెడ్డి సతీమణి శ్రీమతి పరుపాటి లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి మృతురాలి నివాసానికి చేరుకుని పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.మృతురాలి అంతిమయాత్రలో కూడా వారు పాల్గొని కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో బోది రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మేడిపల్లి అశోక్ లక్ష్మి, పంచగిరి కిషన్, బండారి రవి, సయ్యద్ గాలిఫ్, గుర్రాల రఘుపతి, చింతల శ్రీనివాస్ రెడ్డి, పిట్ట ఐలయ్య, మోతే సురేందర్ రెడ్డి, చింతల దేవేందర్ రెడ్డి, తోట బిక్షపతి, మేడిపల్లి రమేష్, గుర్రాల సారయ్య, ఏడు నూతుల విజేందర్ రెడ్డి, చడ మల్లారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొని మృతురాలికి నివాళులు అర్పించారు.