మొక్కజొన్న పంటలకి మద్దతు ధర ప్రకటించాలి
ఎం సి పి ఐ యు పార్టీ చెన్నారావుపేట మండల కార్యదర్శి జన్ను రమేష్
ఈరోజు చెన్నారావుపేట మండల కేంద్రంలో ఎం సి పి ఐ యు పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం జన్ను రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యసంగి మొక్కజొన్న పంటలకి మద్దతు ధర 2500 ప్రకటించాలి.మార్క్ పేడ్ ద్వారా మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలి ప్రతి మండలానికి ఒక్క కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి మార్క్ పేడ్ అమలు చేయకపోవడం ద్వారా రైతులు పండించిన పంటని మధ్య దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతున్నది.కావున పండించిన పంటకి మద్దతు ధర లేక తెచ్చిన పెట్టుబడులు అప్పులు పెరిగిపోతున్నాయని ప్రైవేటు మధ్య దళారులకు రైతులు తక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుంది. ఈరోజు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం మద్దతు ధర లేకపోవడం బాధాకరంగా ఉందని అన్నారు యాసంగి మొక్కజొన్న పంటకి మంచి మద్దతు ధర వస్తుందని రైతులు విస్తారంగా పంటలు వేయడం జరిగింది కానీ ధరలు లేక అతి తక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుంది.అలాగే రైతులకి పంట సహాయం కింద రైతు బంధు ఇప్పటివరకు విడుదల చేయలేదు. ప్రభుత్వం పంట సహాయం కింద ఇచ్చే రైతు బంధు ఇప్పటివరకు విడుదల చేయలేదు యాసంగి పంటలు వేసి రెండు నెలలు కావస్తున్న కాస్త కోస్తా పంట సాయం కింద పంటకు ఉపయోగపడుతాయి అనుకున్న రైతులు రైతు బంధు రైతుల కళ్ళల్లో ఆశ నిరాశే మిగిలిపోయింది.తక్షణమే రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మొర్రి శ్రీను ,అశోక్, రాజిరెడ్డి, గోరే మియా తదితరులు పాల్గొన్నారు