
అస్సలామ్ మలేకుం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు (మాహే రంజాన్ ముబారక్)
💥ఆ అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం మరియు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖశాంతులతో ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను
💥ఈరోజు మీరందరు పిలవగానే ఈ ఇఫ్తార్ విందుకు హాజరైనందుకు మీ అందరికీ షుక్రియా,సంతోషం.
💥అల్లాః కరుణ సాధించడం కోసం పవిత్ర మాసం రంజాన్ కాబట్టి మనమంతా ఈ మాసంలో రోజు దీక్షను పాటిస్తూ ఖురాన్ ను పాటిస్తూ ప్రత్యేక నమాజుతో రోజా దీక్షను పాటిస్తూ ప్రార్థిస్తున్నాము. మతసామ్రస్యానికి రంజాన్ మాసం ప్రతీక.
💥ఈ పవిత్ర మాసంలో నేను మీ అందరిని ఈ సందర్భంగా కలవడం చాలా సంతోషంగా ఉంది.ప్రస్తుత ఈ ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ అంశాన్ని వాగ్దానాన్ని ఏమాత్రం పూర్తి చేయలేదు.
💥కాబట్టి ఈ అంశాన్ని పూర్తి చేయాలి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి ముస్లిం సోదరులు ఎల్లవేళలా అండదండ లు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
💥కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు కలలను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను.
కొన్ని మతత్వ పార్టీలు కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలని చూస్తుంది… దీనిని ప్రజలు గమనించాలని కోరుతూ మరొక్కసారి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను… ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్ గారు 62వ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ 63వ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి మాజీ కార్పొరేటర్ రేపల్లె శ్రీనాథ్ స్టేట్ ఒబిసి సెల్ కోఆర్డినేటర్ చందుపట్ల ధనరాజ్ మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పిఏసిఎస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి గుర్రపు కోటేశ్వర్ బోయిని కుమార్ యాదవ్ హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె రంగనాథ్ హనుమకొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్ కంటెస్టు కార్పొరేటర్ మండల సమ్మయ్య సందెల విజయ్ వస్కుల శంకర్ రాజారపు స్వామి డివిజన్ ఓబీసీ సెల్ డిపార్ట్మెంట్ బన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.