విద్యుత్ కోతలతో రైతులకు గుండెకోత చేతికి వచ్చిన పంట ఎండి పోతుంది. రైతులకు 24 గంటల కరెంట్ ఏమైంది కెసిఆర్ గారు.రేపటి కిసాన్ కాంగ్రెస్ సబ్ స్టేషన్ ఎదుట చేపట్టే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ రోజు ములుగు మండలం రామచంద్ర పూర్ గ్రామములో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక మోడువారితే ఆ రైతన్నల మనోవేదన వర్ణనాతీతంగా ఉంటుందనితెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో చేసే పనుల కంటే కేసీఆర్ చెప్పే గొప్పలే ఎక్కువగా ఉంటాయని..ఈ కరెంట్ కోతలు, 24 గంటల విద్యుత్ విషయంలో మరోసారి రుజువైందని ర అన్నారుప్రజలపై కరెంట్ ఛార్జీల రూపంలో రూ. 16 వేల కోట్ల భారం వేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. పంటలు పండే సమయంలో కరెంట్ కట్ చేస్తున్నారని సీతక్క విమర్శించారు. నాణ్యమైన కరెంట్ అందించి రైతులను ఆదుకోవాలి రేపు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యములో ములుగు జిల్లా కేంద్రములో సబ్ స్టేషన్ ఎదుట చేపట్టే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలి అని సీతక్క గారు ప్రజలకు రైతులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారుకిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషాకిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కరి వేద రాజీ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వాకిటి రామకృష్ణ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు మూల రవీందర్,సాధం సాంబయ్య, కరివేద రాజిరెడ్డి, హాట్కర్ స్వామి, పోరిక ప్రమీల, వేములపల్లి స్వామి, గుగులోత్ కరణ్ సింగ్,కాసుల వెంకటేశ్వర్లు, గూడూరు లలిత వీరారెడ్డి,రాయికంటి కుమారస్వామి, అజ్మీరా మోహన్, బేతి రాజిరెడ్డి, కండికొండ శ్రవణ్, గొర్రె సుధాకర్, కోరుకొప్పుల గోపాలస్వామి, అజ్మీరా జగ్గు, బొద్ధుల మార్కండేయ,రుద్రారపు ప్రభాకర్, వెంకటేశ్వర్లు, గవస్కర్, సాధం వెంకన్న, భూక్యా విలేందర్, నంద రవి,క్రాంతి,తుమ్మ జయరెడ్డి కత్రోజు రమేష్, తదితరులు