సత్తుపల్లి పురపోరులో ఆమెది ఓ ప్రత్యేకత
సమాజoలో రుగ్మతపై పోరు చేసిన కుటుంబం”
నాడు పంచాయతీలో ప్రజాభిమానం పొందిన కుటుంబం”
నేడు గులాబీ మద్దతుతో 19 వార్డు బరిలో పాకలపాటి లక్ష్మీ”
ఈ నెల 11న జరుగనున్న సత్తుపల్లి పుర పోరులో బరిలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులలో అందరిలో ఆమెది ఓ ప్రత్యేకత.ఆమె 19 వార్డులో బిఆర్ఎస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థిని పాకలపాటి లక్ష్మీ.ప్రజాసేవ చేయడం పాకలపాటి కుటుంబానికి కొత్తేమీ కాదు.నాడు సత్తుపల్లి గ్రామ పంచాయతీగా ఉన్న కాలంలో తెలుగుదేశం మద్దతుతో 06 వార్డులో పాకలపాటి ఝాన్సీ గెలుపొంది ప్రజాబివృద్ధికి పాటు పడిన నేపథ్యం ఉంది.ప్రస్తుత 19 వార్డు అభ్యర్థినిగా బరిలో ఉన్న పాకలపాటి లక్ష్మీ ఝాన్సీ తోటి కోడలు కావడం విశేషం.అసలు పాకలపాటి వసంతరావు,బేబీ లు గత నలభైఏళ్లుగా నమ్మిన పార్టీ సీపీఎం కోసం కడవరకు పని చేస్తూ సీపీఎం ప్రజా సంక్షేమం కోసం చేసిన ప్రతి పోరాటంలో ముందుండి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదర్శ కుటుంబం.వారి ద్వితీయ కుమారుడు పాకలపాటి మల్లికార్జునరావు పట్టణంలో వ్యాపార రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నిజాయితీ కలిగిన వ్యాపారిగా పేరు పొందిన వ్యక్తి,అంతే కాకుండా సివిల్ కాంట్రాక్టర్ గా కాంట్రాక్ పనులు చేయడమంటే లాభం కోసం కాదు అది కూడా ప్రజలకు,సమాజానికి సేవ చేసే సువర్ణావకాశంగా బావించి ఎక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మించిన నాణ్యతలో లోపాలు లేకుండా నిర్మించి ప్రభుత్వాల వద్ద మంచి గుర్తింపు పొందిన ఉత్తమ కాంట్రాక్టర్ గా పేరు గాంచారు.అయినప్పటికీ సమాజంలో మహిళలపై జరుగుతున్న అనేక రుగ్మతలపై అనేక పోరాటాలు చేసిన గుర్తింపు కలిగిన మహిళా ఉద్యమకారురాలుగా గుర్తింపు కలిగిన కుటుంబం.సీపీఎం పార్టీ నేర్పిన ఉక్కు క్రమశిక్షణలో జీవిస్తున్న మార్పు కోరకు పోరులో భాగస్వామ్యం అవుతున్న కుటుంబం పాకలపాటి లక్ష్మీ కుటుంబం. ఏ మాటలు వెనుక ఏ అర్థాలు దాగి ఉన్నాయో గ్రహించి ప్రజలకు సుపరిపాలన అందించడం ఉగ్గుపాలతో పెట్టిన విద్యగా ఉన్న కుటుంబం. ఇది మిగిలిన కౌన్సిలర్ అభ్యర్థులకు పాకలపాటి లక్ష్మీ కు వ్యత్యాసం.ఈ నెల 11న జరగనున్న పుర పోరులో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థినిగా మరోసారి ప్రజా సేవ చేయడానికి పాకలపాటి లక్ష్మీ 19 వ వార్డులో బరిలో నిలిచారు.అందుకని వార్డులోని విజ్ఞులైన ఓటర్లు లక్ష్మి ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించడం అందరి శ్రేయస్సుగా బావించి గెలిపించాలిసిన బాధ్యత ఉంది.అయితే పాకలపాటి లక్ష్మీ నాడు ఉమ్మడి నియోజకవర్గంలో అశ్వారావుపేట, దమ్మపేట మండలాలలో సీపీఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిన, కూలీరేట్లు పెంచించిన ప్రజా బాంధవుడు గరిమెళ్ళ వెంకటేశ్వరరావు కుమార్తె పాకలపాటి లక్ష్మీ అనే విషయాన్ని చివరగా తెలుపుతున్నాను. లక్ష్మీ నివసించే వీధికి ప్రపంచ విప్లవకారుడు మహాత్ముడు లెనిన్ పేరు ను నామకరణం చేయించి అందరి నోట లెనిన్ తెలిసేలా చేసిన కుటుంబo.