సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలి
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రభుత్వం ఒక కలం పోటుతో వాటిని రద్దు చేస్తున్నారని కార్మిక సంక్షేమాలు ప్రయోజనాలను పరిణులకు తీసుకొని రూపొందించబడ్డ హక్కులను ఒక్కొక్కటి తొలగిస్తున్నారని అందులో భాగమే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ గా మార్చారు ఇది కార్మికులకు నష్టకరమైన చర్యని టియుసిఐ ఖమ్మం జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్ అన్నారు.బుదవారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ చేయటం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో వచ్చిన కార్మిక చట్టాలను నూతివీకరణ చేస్తున్నారని కార్మికులకు లాభం కలిగే విధంగా సవరిస్తున్నామని చెప్పి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చరానీ భవిష్యత్తులో కాంట్రాక్టర్లు కార్మికులకు అన్యాయం చేస్తున్న అడగటానికి అవకాశం లేకుండా చేస్తున్నాయని వారు అన్నారు . ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్న . కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం జీవో ప్రకారం వారికి వేతనాలు అందటం లేదని అరకొరగా ఇస్తున్నారని వారు అన్నారు. .సోషల్ సెక్యూరిటీ పేరు మీద సామాజిక బాధ్యత కల్పిస్తామంటున్న పాలకులు కనీసం ప్రైవేట్ ఫండ్ అమలు నుండి తప్పుకోవడానికి అవకాశాన్ని కల్పించడం, 12 శాతం పిఎఫ్ ను 10% కూడా తగ్గించుకోవచ్చని అవకాశం కల్పించడం ఈఎస్ఐ కార్మికుల భీమా చట్టం ఈ చట్టం కార్మికులకు దీమనిస్తూన్నాది కాని నేడు తీసుకొచ్చిన సామాజిక భద్రత చట్టం కార్మికులకు ధీమాను కార్మికుల రక్షణ గాల్లో దీపంగా మార్చేసిందని ఈ తరుణంలో కార్మిక వర్గం మొత్తం కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉండి ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలని వారు పిలుపు నివ్వటం జరిగింది.ఈ కార్యక్రమం లో పాపారావు, రవి, కళ్యాణ్, మరేశ్వరరావు, రావణ, రాంలి, సరోజినీ, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.