సింగరేణి అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష
సింగరేణి సంస్థ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి, సంస్థ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారంపై సెక్రటేరియట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు డి. శ్రీధర్ బాబు, దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు.సింగరేణి సీఎండీతో పాటు సింగరేణి ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు సమావేశంలో పాల్గొని తమ తమ నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంస్థ విస్తరణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కూడా సమావేశంలో పాల్గొని నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.