సీపీఐ ఎంఎల్ లిబరేషన్ సభ్యుడిగా బందు క్రాంతి ఎన్నిక
సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ తెలిపారు.బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తున్న బందు క్రాంతికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు.ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.నూతనంగా ఎన్నికైన బందు క్రాంతి మాట్లాడుతూ,పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ,సామాన్య ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్కూరి శ్రీకాంత్, బందు సుజాత, స్వాతి తదితర పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.