22 దరఖాస్తుల స్వీకరణ
22 దరఖాస్తుల స్వీకరణ
తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ మే11
స్టేషన్ ఘనపూర్ లో సోమవారం రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న పాల్గొన్నారు.డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 22 దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆర్డీఓ, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులు మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.