హనుమకొండలో ఉద్రిక్త వాతావరణం
హనుమకొండ జిల్లా బంజారాల ఆరాధ్య దైవం, గొప్ప సంఘసంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ,రాష్ట్రంలోని పేద గిరిజన వర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పెండింగ్ స్కాలర్షిప్స్, రియాంబర్స్మెంట్,ఉద్యోగ నోటిఫికేషన్లు తక్షణమే భర్తీ, బ్యాక్లాగ్ ఎస్టీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యగ కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డా.గుగులోతు రాజునాయక్ ఉపాధ్యక్షులు వాంకుడోత్ అశోక్ నాయక్ లను కాకతీయ యూనివర్సిటి పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు.సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి నాయక్ ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.అర్ధరాత్రి అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణిచివేయలేరని ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకుంటూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.