

చత్తీస్‌గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం రక్తపు ఏరులు మారుస్తోంది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఈ69న్యూస్:- హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, చత్తీస్‌గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం “రక్తపు ఏరులు” పారుస్తోందని విమర్శించారు. మమావోయిస్టులపై చర్చలకు సిద్ధమంటూ ఎన్కౌంటర్లు కొనసాగించడాన్ని ఆయన దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. అమాయక గిరిజనుల ప్రాణాలు ఎన్కౌంటర్లలో పోతున్నాయని,వెంటనే ఆపరేషన్ కాగర్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అలాగే కేసీఆర్ అధికార కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో 2 లక్షల రుణ మాఫీ,ఎస్సీ వర్గీకరణ,కుల గణన పూర్తి,ఉచిత సన్న బియ్యం పంపిణీ వంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని పేర్కొన్నారు.కాంగ్రెస్‌పై సాగుతున్న అసత్య ప్రచారాన్ని బిఆర్ఎస్ నాయకులు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Awesome https://is.gd/N1ikS2
Good https://is.gd/N1ikS2