10 నెలల పసికందుకు స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్
ఖమ్మం ప్రాంతానికి చెందిన 10 నెలల బాబు ఎముక మజ్జ వైఫల్యంతో బాధపడుతున్న తరుణంలో ఆ బాబు తల్లిదండ్రులు హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ ను సంప్రదించంగా అక్కడ వైద్య బృందం అరుదైన శాస్త్ర చికిత్స అందించి వైద్యులు అత్యాధునిక హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ మార్పిడి చేసి కొత్త జీవితాన్ని అందించారని ఖమ్మం యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ కుమార్ వెల్లడించారు . ఇది వారసత్వంగా వచ్చే అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా అనే అరుదైన ఎముక మజ్జ వ్యాధి . గతేడాది డిసెంబర్ 26న సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు . సమగ్ర క్లినికల్ పరీక్షల అనంతరం అమె గాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా ఉన్నట్లు మరియు ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉండటాన్ని గుర్తించారు . శస్త్రచికిత్స పూర్తిచేసుకున్న చిన్నారితో వైద్య బృందం నిర్ధారణ అయిందని ఇది తీవ్రమైన థ్రోంబోసైటోపె నియా , రక్తస్రావం , ప్రమాదంతో కూడిన అరుదైన వారసత్వంగా వచ్చే ఎముక మజ్జ వైఫల్య రుగ్మతగా గుర్తించి తండ్రి మూల కణాలను ఉపయోగించి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జనవరి 8న విజయవంతంగా నిర్వహించారు . బాబు వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడని నిర్ధారించుకున్న తరువాత డిశ్చార్జ్ చేశామని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో Mr. శ్రీధర్ రావు , బాల కృష్ణ , నాగార్జున పాల్గొన్నారు .