కలెక్టర్ రాహుల్ శర్మ
కలెక్టర్ రాహుల్ శర్మ
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తమ ఎన్నికల గుర్తింపు కార్డు (ఎపిక్) సంఖ్యను టైప్ చేసి 1950 అనే ఉచిత సంఖ్యకు లఘు సందేశం (ఎస్.ఎం.ఎస్) పంపడం ద్వారా తమ ఓటు నమోదు వివరాలను మొబైల్ ఫోన్లో పొందవచ్చని వివరించారు.ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును సరిచూసుకోవాలని,ఏవైనా మార్పులు లేదా చేర్పులు ఉంటే సమయానికి పూర్తి చేసుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని,ప్రతి ఒక్కరూ దాని విలువను గుర్తించి తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.