zaffergadh news local news telugu galam newsగత 20 రోజుల క్రితం ఇదే ట్రాన్స్ఫార్మర్ లో కాఫర్ వైర్ చోరీ

గత 20 రోజుల క్రితం ఇదే ట్రాన్స్ఫార్మర్ లో కాఫర్ వైర్ చోరీ

తెలుగు గళం జఫర్ఘడ్

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తిమ్మంపేట గ్రామంలో రైతు మంద మల్లేష్ వ్యవసాయ భూమి వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో రాగి తీగలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. గత 20 రోజుల క్రింద ఇదే ట్రాన్స్ఫార్మర్ లో రాగి తీగలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయగా వేరే ట్రాన్స్ఫార్మర్ అమర్చారు.మళ్లీ సోమవారం ఉదయం రైతు మంద మల్లేష్ తన వ్యవసాయ భూమి వద్దకు ఉదయం 6 గంటలకు వెళ్లి చూడగా ట్రాన్స్ఫార్మర్ కింద పడవేసి ఉన్న దానిని చూసి లైన్ మెన్ కుమార్ స్వామికి సమాచారం ఇవ్వగా అతను తన పై అధికారులకు సమాచారం అందించారు.సమాచారం తెలుసుకున్న సహాయక ఇంజనీర్ విశ్వ సాహితి సంఘటన స్థలం వద్దకు వెళ్లి పంచనామా చేశారు.రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రవికుమార్ సంఘటన స్థలం వద్దకు చేరుకొని పరిశీలించారు.అసిస్టెంట్ లైన్ మెన్ ఉపేందర్ పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *