jayapur foot e69news local news anthapur news antapur news-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

-ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

తెలుగుగళం న్యూస్,అనంతపురం.

అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్ల (ఆర్టిఫిషియల్ లెగ్స్)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐ.ఏ.ఎస్ పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్లూరు మండలం కందిగోపుల గ్రామానికి చెందిన వెంకట రామయ్య, ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన ఓబులమ్మ, గుత్తి ఆర్ఎస్ కు చెందిన భాగ్యమ్మ అనే ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కటి 3 వేల రూపాయలు విలువ చేసే కృత్రిమ కాళ్లను మరియు వెయ్యి రూపాయలు విలువచేసే చేతి కర్రలను జిల్లా కలెక్టర్ వారు కూర్చున్న చోటుకే స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేసేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఎడిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి రసూల్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *