ఘనంగా ముగిసిన మండల బ్లాక్ లెవెల్ క్రీడలుఘనంగా ముగిసిన మండల బ్లాక్ లెవెల్ క్రీడలు

మహబూబాద్ జిల్లా:మేరా యువ భారత్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన నెల్లికుదరు మండల బ్లాక్ లెవెల్ క్రీడలు విజయవంతంగా ముగిశాయి. ఈ క్రీడలో బాలుర కబడ్డీ విభాగంలో తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతిని గెల్చుకున్నారు ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు మాట్లాడుతూ. నిజ జీవితంలో క్రీడలు ఎంతో దోహదపడతాయని మానసికంగా శారీరకంగా ధృడత్వాన్ని పెంపొందించడానికి, క్రీడలు తోడ్పడతాయని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి, అలా చేసినప్పుడే భవిష్యత్తులో ముందు అడుగు వేస్తారన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కొమురయ్య, మేరా యువ భారత్ జిల్లా యూత్ కోఆర్డినేటర్ ధరావత్ రాజేందర్ నాయక్ మరియు అధ్యాపకులు కుటుంబరావు, సక్రం రాథోడ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *