బాధిత కుటుంబాలకు సర్పంచ్ ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు సర్పంచ్ ఆర్థిక సహాయం

రేగొండలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన సర్పంచ్ వారణాసి మౌనిక అజయ్

రేగొండ మండల కేంద్రంలో ఇటీవల మరణించిన గౌడ కులానికి చెందిన మాడగాని సారయ్య, తడక స్వామి కుటుంబాలకు రేగొండ గ్రామ సర్పంచ్ వారణాసి మౌనిక అజయ్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేశారు.బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకున్న సర్పంచ్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి రూ.2,000/- చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ, ఇలాంటి కష్టసమయాల్లో గ్రామ పంచాయతీ ప్రజలతో పాటు నిలబడటం తన బాధ్యత అని సర్పంచ్ తెలిపారు.గ్రామంలో ఎలాంటి ఆపద వచ్చినా ప్రజల వెంట నిలబడి అవసరమైన సహకారం అందిస్తామని, ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరగడం ఎంతో బాధాకరమని ఆయన పేర్కొన్నారు.బాధిత కుటుంబాలకు గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొని సర్పంచ్ చేపట్టిన మానవతా సహాయ చర్యలను అభినందించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *