Month: January 2026

మూలమర్రి తండ లో చీరలు పంపిణీ
రానున్న సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు,బంధువుల ఇళ్లకు ప్రయాణించనున్న నేపథ్యంలో,ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేశామని తెలిపారు.రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని,నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని సూచించారు.అలాగే పొరుగువారు, గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో పాటు, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందుగానే తెలియజేయడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చని తెలిపారు.సంక్రాంతి సెలవుల సమయంలో చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇళ్లలోకి చొరబడి నేరాలకు పాల్పడే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు.గతంలో నేరాలు నమోదైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వీధి దీపాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు ఉన్న వారు అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదో పరిశీలించుకోవాలని సూచించారు.అపరిచిత వ్యక్తులు ఇళ్ల చుట్టూ తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.అలాగే పండుగల సమయంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు వాహనాలకు తాళాలు సరిగా వేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.సంక్రాంతి పండుగల సమయంలో జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే డయల్–100కు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.ప్రజల అప్రమత్తత,పోలీస్ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా నేరరహిత వాతావరణంలో శాంతియుతంగా,సురక్షితంగా సంక్రాంతి పండుగలను జరుపుకోవచ్చని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ పేర్కొన్నారు.

సంక్రాంతి సెలవుల్లో దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలకు పలు సూచనలు చేసిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ రానున్న సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలు…

నాచారం ఈఎస్ఐ హాస్పిటల్‌లో రోగులకు పండ్ల కిట్ల పంపిణీ

నాచారం ఈఎస్ఐ హాస్పిటల్‌లో రోగులకు పండ్ల కిట్ల పంపిణీ

సికింద్రాబాద్ నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్‌లో శనివారం అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ శాఖ వయోజన సమితి ఆధ్వర్యంలో రోగులకు సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న…

మదర్ థెరీసా విద్యాలయంలో సంక్రాంతి సంబురాలు

మదర్ థెరీసా విద్యాలయంలో సంక్రాంతి సంబురాలు

సత్తుపల్లి,ఆర్ సి,జనవరి10(తెలుగుగళం) న్యూస్: సత్తుపల్లి పట్టణంలోని మధర్ తెరిస్సా టెక్నో విద్యాలయంలో శనివారం ముందస్తుగా సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే…

రూ.10 వేల విలువైన క్రికెట్,చెస్ కిట్ల అందజేత

రూ.10 వేల విలువైన క్రికెట్,చెస్ కిట్ల అందజేత

మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన యువకులు రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రీడలను ప్రోత్సహించే దిశగా ముందడుగు వేశారు.తాటికొండతో పాటు పరిసర గ్రామాలైన ఫతేపూర్,చిల్పూర్‌లలో నిర్వహించనున్న క్రికెట్…

వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు

వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారామపురం గ్రామంలో ఉన్న ప్రేమ సదన్ వృద్ధాశ్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడెల్లి నియాన్స్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా…

వేంసూరు మండలoలో నూతన రేషన్ దుకాణాల కొరకు దరఖాస్తుల

నూతన రేషన్ దుకాణాల కొరకు దరఖాస్తులు చేసుకోండి:తహశీల్దార్ మాణిక్ రావు”

సత్తుపల్లి,ఆర్ సి,జనవరి09(తెలుగు గళం)న్యూస్: సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో నూతన రేషన్ దుకాణాల కొరకు దరఖాస్తులను సబ్ కలక్టర్ అజయ్ యాదవ్ కోరారు.రామన్నపాలెం గ్రామంలో(2230018) బీసీ…

జ్వరాలు లేని గ్రామంగా తీర్చిదిద్దే దానికి కృషి చేయాలని పిలుపు"

భరణిపాడు లో వైద్యశిబిరం”పాల్గొన్న సర్పంచ్”

జ్వరాలు లేని గ్రామంగా తీర్చిదిద్దే దానికి కృషి చేయాలని పిలుపు” సత్తుపల్లి,ఆర్ సి,జనవరి10(తెలుగు గళం)న్యూస్:ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలోని భరణిపాడు గ్రామంలో గల గ్రామ…

రాంపురం గ్రామపంచాయతీ పరిధి మొదటి వార్డు

మొదటి వార్డులో శానిటేషన్ పనులు

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామపంచాయతీ పరిధి మొదటి వార్డులో స్థానిక సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి…

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నేరం

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నేరం

చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం మినీ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు…