లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా గణేష్ ఉత్సవాల నేపథ్యంతో రూపొందించిన E69NEWS నివాళి పోస్టర్లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా E69NEWS ఆధ్వర్యంలో ఘన నివాళులు.

౧౮౯౩ సంవత్సరంలో మనం గణేష్ పండుగను ఈ విధంగానే జరుపుకునే వాళ్లమా ? అంటే లేదు అనే చెప్పుకోవాలి అదేంటి అనుకుంటున్నారా అవును మనం గతంలో ఇప్పుడు జరుపుకుంటున్నట్టు హంగులు ఆర్భాటాలు ఏమి లేవు అసలు తిమ్మిడి రోజులు జరుపుకునే వాళ్ళమే కాదు ఒక్క రోజు మాత్రమే జరుపుకునే వాళ్ళం అది కూడా అందరు కాదు బ్రాహ్మణ కుటుంబము లో వున్నా వాళ్ళు జరుపుకునే వారు లేదా ఉన్నతమైన కొన్ని కుటుంబాలు ఇండ్లలో జరుపుకునే వారు కానీ ఆ సమయం అనేది బ్రిటిష్ పాలనా కొనసాగుతున్న రోజులవి నలుగురు కలిసి కనిపిస్తే శిక్షించే రోజులు అవి మరి అలాంటి రోజులలో అందరిని సమీకరించాలి అంటే ఒక్క పండుగలకు మాత్రమే మినహాయింపు ఉండేది అప్పుడే వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టాలి అనుకున్నాడు బాలగంగాధర్ తిలక్ అప్పుడు వున్నా ఈ బాల గణేష్ ని ఇండ్లలో మాత్రమే పెడితే ఆ ఒక్క రోజు పండుగ మాత్రమే అవుతుంది ఆ కుటుంబములో నలుగురు మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది కానీ అదే గణేషుడిని మన చౌరస్తాలో పెట్టి దానిని నవరాత్రులుగా పాటిస్తే మనం అందరిని ఐక్యం చేయవచ్చు అనుకున్నాడు బాలగంగాధర్ తిలక్ ఆ ఆలోచన ఆచరణ దిశగా అడుగులు వేశాడు తన లక్ష్యం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి ఆటంకాలను విఘ్నాలను తొలగించే వాడు విఘ్నేష్ అని తిలక్ ఈ ఉత్సవంలో జాతీయవాదాన్ని నింపారు

అసలు మరి ఇక్కడ గణేషుడిని స్థాపించక తన పని ఆయిపోలేదు ఇక్కడే బీజం పడింది ఈ వేడుకలో అందరిని సమీకరించడం దేశభక్తి గీతాలకి జాతీయవాద ఇతి వృత్తలను తెలియజేయడం ద్వారా ప్రజలను స్వాతంత్య్రం కోసం ప్రజల మద్దతును కూడగట్టడానికి ఒక వేదికగా ఉపయోగించాలి అనే తన ఆలోచన ఫలించింది
అసలు ప్రజలకి తాను ఈ వేదికగా ఎం తెలియజేశాడు తిలక్ యొక్క విస్తృత లక్ష్యం స్వరాజ్యం అలాగే స్వీయ పాలన జాతీయ వాద ఉద్యమంలో పాత్రగా చెప్పుకోవచ్చు
అయితే అప్పుడు కూడా ఇక్కడ బ్రాహ్మణలకి బ్రాహ్మణులెతరులకి మధ్య ఉన్న విభేదాలు తొలగించి ఏకీకృత హిందూ గుర్తింపు పెంపొందించడం అయన ప్రయత్నాలు లక్ష్యంగా హిందూ దేవతలను సాంస్కృతిక చిహ్నాలను ఉపయోగించుకొని తిలక్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రతిఘటనలను బలోపేతం చేయడానికి జాతీయ గర్వం ఐక్యత బ్యహవం నింపడానికి ప్రయత్నించారు
ఈ ప్రయత్నం ఫలించింది గతం నుండి ఆచారంగా నేటి వరకు అలా కొనసాగుతూ వస్తుంది కానీ నాడు జాతీయత ఐక్యతకు చేసిన ఈ పండుగ స్వాతంత్ర్య అనంతరం కూడా కొనసాగిన కూడా తరువాత దైవ భక్తి పాటలు, భజనలు , నాటికలు , చేస్తూ కథలు పురాణాలు ఈ నవరాత్రుల సందర్బముగా తెలియని వారికీ తెలియజేసే ప్రయత్నం చేసే వారు ఇప్పటికి ఇంకా కొన్ని చోట్ల భజనలు , నాటికలు , పురాణాలు చేస్తున్నారు .
నేడు ఇప్పుడు ఇంకా యువత గణపతిని పెట్టాలి అంటే అంగరంగ వైభవంగా ఒక ప్రణాళిక రచించి ముందుకు వస్తున్నారు కానీ అక్కడ వారు తెలియని వారికి తెలియని విషయాలను తెలియజేసే ప్రయత్నం చేస్తే తిలక్ చేసిన ఈ గణేష్ ఆగమనానికి అర్థం ఉంటుంది .
ఇక్కడ వారు గొప్ప వీరు గొప్ప అంటూ ఆకారాలు పెద్దవి అనుకోవడం కంటే చిన్న విగ్రహం అనే కంటే మనం ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద మన ఎలా భక్తి శ్రద్దలతో పూజ చేశాం ఎంత మందికి తెలియని విషయాలు తెలియజేశాం అనే విషయాలను చవి చూసుకోవాలి విఘ్నలను తొలగించే వినాయకుడు విన్నవించే విషయాలు ఏంటి సంస్కృతిని ని ఎలా వారసత్వంగా కాపాడుతూ వస్తున్నాం మన తరాలకి మనం ఎం సందేశం ఇస్తున్నాం అనే విషయాన్నీ ఆలోచిస్తూ మనం ముందుకు సాగాలి .

ఆర్ . బి ప్రసాద్

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *