ఎంజీఎంలో లక్ష్మణ్ నాయక్‌ను పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి
నిందితులతో పాటు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి


వేలేరు, సెప్టెంబర్ 17 (ఈ69న్యూస్)

హన్మకొండ జిల్లా వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఆయనను సాయిపేట–కేశవనగర్ సమీపంలో అడ్డుకుని ఇనుప రాడ్‌తో తలపై కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ నాయక్‌ను స్థానికులు హుటాహుటిన వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.ఎంజీఎంలో పరామర్శ
దాడి విషయం తెలుసుకున్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి గురువారం ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న లక్ష్మణ్ నాయక్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.దాడిని ఖండించిన డీసీసీ అధ్యక్షుడుఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిపై భౌతిక దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ఖండించారు. దాడికి పాల్పడిన నిందితులతో పాటు ఘటన వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *