• గ్రామ శివారులో చిరుత జాడలు.. ప్రజల భద్రతకు తక్షణ చర్యలు అవసరం
  • చిరుత సంచారంపై అటవీ శాఖ అప్రమత్తం కావాలి..
  • పాదముద్రలను పరిశీలించి చర్యలు చేపట్టాలి

ఈ69న్యూస్ ఏటూరునాగారం, సెప్టెంబర్ 25:

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామ పరిసరాల్లో చిరుత పులి జాడలు కనిపించడంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. గ్రామ సమీపంలో చిరుత పాదముద్రలు కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచారం వల్ల ప్రజలతో పాటు పశువుల భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అటవీ శాఖ అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి పాదముద్రలను పరిశీలించాలని, చిరుత కదలికలను గుర్తించేందుకు నిఘా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అవసరమైతే కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి చిరుత సంచారాన్ని నిర్ధారించాలని, ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా గ్రామ శివారు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులు సూచిస్తున్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *