ఈ69న్యూస్ జనగామ అక్టోబర్ 05

జనగామ జిల్లా, జఫర్‌ఘడ్ మండలం, ఉప్పుగల్లుకు చెందిన పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి రెడ్డి జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రెడ్డి జాగృతి ప్రతినిధులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.రెడ్డి జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రెడ్డి సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో యువతకు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను అప్పగించిన రెడ్డి జాగృతి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ సంస్థ బలోపేతానికి, రెడ్డి సామాజిక వర్గ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.“నాపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రెడ్డి జాగృతి బలోపేతానికి, సామాజిక వర్గ సంక్షేమానికి కృషి చేస్తాను” అని పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బుట్టంగారి మాధవరెడ్డి, నీరుడు దయాకర్ రెడ్డి, ఎడ్ల ఉప్పల్ రెడ్డి, కర్రెడ్డి రఘునందన్ రెడ్డి, బుజంజాగా రెడ్డి తదితరులు పాల్గొని నూతనంగా నియమితులైన పోరెడ్డి సత్యనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *