అర్హులైన గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అభ్యర్థులను ఓటర్లుగా నమోదు చేయాలి: డా. తాటికొండ రాజయ్య
ఈ69న్యూస్ ధర్మసాగర్, అక్టోబర్ 12

ధర్మసాగర్ మండలానికి సంబంధించి సోమవారం రోజు నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమీక్ష సమావేశంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని డా. తాటికొండ రాజయ్య సూచించారు. అర్హులైన కొత్త గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అభ్యర్థులను గుర్తించి, వారందరికీ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు నమోదుకు అవకాశం కల్పించేలా సంబంధిత ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు.