వాహనంలో విద్యార్థులు.. ఒక్కసారిగా కలకలంవాహనంలో విద్యార్థులు.. ఒక్కసారిగా కలకలం

తిర్లాపురం చెరువులో బోల్తాపడిన కురవి గీతాంజలి స్కూల్ టాటా మ్యాజిక్ వాహనం!

వాహనంలో విద్యార్థులు.. ఒక్కసారిగా కలకలం

తెలుగు గళం న్యూస్ కురవి/మహబూబాబాద్ జిల్లా.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గీతాంజలి ప్రైవేటు పాఠశాలకు చెందిన టాటా మ్యాజిక్ వాహనం తిర్లాపురం చెరువులో బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లిన క్రమంలో డ్రైవర్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా నడుపుతున్న క్రమంలో వాహనం అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. ఘటన సమయంలో వాహనంలో 14 మంది విద్యార్థులు కూడా ఉన్నారు,వాహనం చెరువులో పడటంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి, స్థానికుల సహాయంతో విద్యార్థులను వ్యాన్లో నుంచి బయటికి తీసిన స్థానికులు, వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, అర్హత లేని డ్రైవర్లతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు,విద్యార్థుల కు జరగరానివి ఏమైనా జరుగుతే బాధ్యత ఎవరంటూ తల్లిదండ్రుల ఆవేదన.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *