గౌడ్ ఆదేశాలతో గ్రాడ్యుయేట్ ఓటు నమోదు కేంద్రం ఏర్పాటు
శేరిలింగంపల్లి, నవంబర్ 01( తెలుగు గళం ) న్యూస్
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ ఫేస్ 2 లో గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు కేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ ఆదేశాలతోఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన అర్హత కలిగిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఓటు నమోదు కొరకు ఆన్లైన్ లో గానీ, మేము ఏర్పాటుచేసిన కేంద్రాలలో గానీ, శంషిగూడ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా మీ ఓటును నమోదు చేసుకోవచ్చని అన్నారు
మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలను తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు నవంబర్ 6 వరకు ఉన్నందున అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
