ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్యఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య


-ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలి

హైదరాబాద్, నవంబర్ 01:
తమ డిమాండ్ల సాధనకై కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళ జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక ఏశ్ళుగా నడుస్తున్న కేబుల్ ఛానళ్ళను ప్రభుత్వం అణిచి వేసే కుట్ర చేస్తుందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాస్ లు ధ్వజమెత్తారు. చిన్న పత్రికలను, కేబుల్ చానళ్ళ సంఖ్యను కుదించాలనే కుట్రలో
భాగంగానే ఇటీవల ఇంటర్నెట్ ప్రోటోకాల్(IP) నెట్వర్క్ ద్వారా నడుస్తున్నాయనే సాకుతో అనేక కేబుల్ చానళ్ళకు, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డుల జారీలో అనేక అవకతవకలు జరిగాయని, లక్షల రూపాయల పెట్టుబడితో నడుపుతున్న అసలైన కేబుల్ చానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని వారు ఆరోపించారు.కేబుల్ చానళ్ళ నిర్వహకులూ జర్నలిస్టులే అని, వీళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్నది కేవలం అక్రెడిటేషన్లు తప్ప గొంతెమ్మ కోర్కెలు కావని అన్నారు.
కేబుల్ చానళ్ళకు గతంలో జిల్లాకు నాలుగు కార్డులు, రాష్ట్ర స్థాయిలో 12 కార్డులు ఉండగా వీటిని సగానికి తగ్గించారని, దీనివల్ల కేబుల్ చానళ్ళు ఒకవైపు ప్రభుత్వం నుంచి అడ్వర్టయిజ్మెంట్లు లేక మరోవైపు అక్రెడిటేషన్ కార్డులు లేక అనేక చానళ్ళు మూతపడే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిజం వృత్తి పై ఆధారపడి ఎన్నో ఏళ్ళుగా కేబుల్ చానళ్ళు నడుపుతున్న వేలాది మంది జర్నలిస్టులను ప్రభుత్వం రోడ్డున పడేస్తుందని ధ్వజమెత్తారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో ప్రభుత్వాలు చిన్న పత్రికలను, కేబుల్ ఛానళ్ళను చిన్నచూపు చూడడం సరైంది కాదని,
ఐపీ ఛానళ్ళ పేరుతో కేబుల్ చానళ్ళను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రభుత్వం జర్నలిస్టులకు 44 వేలకు పైగా అక్రెడిటేషన్లు ఇస్తుందని చెప్పిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…ఇప్పటి వరకు ఎన్ని అక్రెడిటేషన్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారనే విషయాలను వెల్లడించాలని అన్నారు. చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న కేబుల్ చానళ్ళకు ఎటువంటి కొర్రీలు పెట్టకుండా న్యాయ బద్దంగా అక్రెడిటేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్ల కోసం కేబుల్ చానళ్ళ యజమానులు, జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, రేపు రెండో తేదీన హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని I&PR కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో పాల్గొంటామని తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *