
29 న చలో ఖమ్మం కేరళ ముఖ్యమంత్రి. పినరయ విజయన్ హాజరు
ఈనెల29న ఖమ్మంలో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు పార్టీ వెంకటాపురం గ్రామ శాఖల సమావేశం దీకొండ ఉప్పలయ్య. పోచమ్మ అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి చక్రపాణి* ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసివేసే కుట్ర జరుగుతుందని అన్నారు దేశంలో ఎక్కడలేని విధంగా కేరళ ప్రభుత్వం రోజు కూలి 836 రూపాయలు ఇస్తుంటే బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న గుజరాతిలో కేవలం 236 రూపాయలు ఇస్తుందని అంటే కూలీల ను శ్రమదోపిడి చేస్తుందని అన్నారు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో విద్యుత్ రంగాన్ని ప్రవేట్కరణ చేయాలనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నిర్ణయించిందని దీనికి వ్యతిరేకంగా విద్యుత్తు ప్రైవేటీకరణ. ఆపి విద్యుత్ సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా విద్యుత్ బిల్లును పార్లమెంటుకు తీసుకురావడం దారుణమని అన్నారు ఇది కేవలం పెట్టుబడుదారుల కోసం విద్యుత్ ప్రవృత్తికరణ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకొని ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఎం మండల కార్యదర్శి. కాడ బోయిన లింగయ్య మాట్లాడుతూ పేదలకు కూడు గూడు నీడ అందించవలసిన ప్రభుత్వాలు వాటిని విస్మరించారని అన్నారు బిజెపి ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచకుండా అన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారధత్వం చేస్తున్నారని అన్నారు. పేదలు వేసుకున్న గుడిసెలకు ఇండ్ల పట్టాలిచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గుడిసె కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజువారి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పై సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈనెల 29న ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల SR&BGNR.లో జరిగే భారీ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరవుతున్నారు దీనికి రైతులు. వ్యవసాయ కూలీలు. కార్మిక వర్గం. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కే నారాయణ రెడ్డి. వెంకన్న కొమురయ్య శరణ్య. రాధిక సరోజన యాకయ్య నరసయ్య కుమారస్వామి కవిత సృజన పద్మ మోహన్ రావు సలీం తదితరులు పాల్గొన్నారు