63 ఏళ్ల అనుభవం కలిగిన న్యాయవాది రామ్ గోపాల్ రావు63 ఏళ్ల అనుభవం కలిగిన న్యాయవాది రామ్ గోపాల్ రావు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ10 July, 2026E69NEWS

63 ఏళ్ల అనుభవం కలిగిన న్యాయవాది రామ్ గోపాల్ రావు

63 ఏళ్ల అనుభవం కలిగిన న్యాయవాది రామ్ గోపాల్ రావు

ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాదుల పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గురుపూజోత్సవం కార్యక్రమం శుక్రవారం హనుమకొండలోని పాత న్యాయవాదుల భవనంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాద వృత్తిలో విశిష్ట సేవలందించిన 25 మంది సీనియర్ న్యాయవాదులను శాలువాలు కప్పి సత్కరించారు.సన్మానితుల్లో 63 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో సేవలందిస్తున్న సీనియర్ న్యాయవాది రామ్ గోపాల్ రావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు సదాశివరావు, జీవరత్నం, మురళీధర్, లక్ష్మీనారాయణ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సీతారాం రెడ్డి, రమేష్ గౌడ్, సదాశివుడు, రామస్వామి, అంబరీష్ రావు, శ్రీనాథ్, మంజుల జయశ్రీతో పాటు మరో 24 మంది సీనియర్ న్యాయవాదులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సన్మానితులైన సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాద వృత్తి పవిత్రమైనదని, యువ న్యాయవాదులు నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు. సమాజంలో న్యాయం, ధర్మం నిలబెట్టడంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాదుల పరిషత్ ఉపాధ్యక్షులు మాతంగి రమేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంషాన్ని సునీల్, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు సొల్లేటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వల్లపురెడ్డి మురళీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిదంబరనాథ్, కేవీకే గుప్తా, గౌతమ్ ప్రసాద్, ఇందు, తేజ రెడ్డి, హనుమకొండ, వరంగల్ న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, సభ్యులు, న్యాయవాదుల పరిషత్ కమిటీ సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *