ప్రభుత్వ బడుల లోనే నాణ్యమైన విద్యప్రభుత్వ బడుల లోనే నాణ్యమైన విద్య
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ10 July, 2026E69NEWS

ప్రభుత్వ బడుల లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల లోనే నాణ్యమైన విద్య

నేతావత్ పాఠశాలకు హెన్కేల్ సంస్థ నుంచి అభివృద్ధి పనులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బడుల్లో వసతుల కల్పన అత్యంత ఆవశ్యకమని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జయ అన్నారు. శుక్రవారం పాఠశాల పూర్వ విద్యార్థి బానోతు అనీల్ చొరవతో హెన్కేల్ జీటీసీ కంపెనీ పాఠశాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మరిపెడ మండలం నేతావత్ పర్కల్ జాల్ తండా ప్రభుత్వ పాఠశాలకు బాత్రూం నిర్మాణంతో పాటుగా పేయింటింగ్, కంప్యూటర్, ప్రొజెక్టర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జయ,ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ హఫీజ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థి అయిన అనిల్ సేవలను కొనియాడారు. అనంతరం కంపెనీ బృంద సభ్యుడు మహేంద్ర మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సమాజానికి సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు గీతాదేవి మేడం, ఏ ఏ పీ సి చైర్పర్సన్ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంత్, కిషోర్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *