
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 118 వ.జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు భాస్కర్ అధ్యక్షత వహించారు.అనంతరం బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది.కార్యక్రమంలో అధ్యక్షులు బొట్ల రమేష్ గౌరవ అధ్యక్షులు ఏల్పుల ధర్మరాజు కోశాధికారి కట్కూరి సర్జన్ రాజ్ జాయింట్ సెక్రెటరీ బానోతు బాలునాయక్ రావుల ఆనంద్ నాయకులు వరికాల ఆదాం పోశాల స్వామి ఓరుగంటి జీవన్ కలకోట్ల శ్యామ్ పాశం రవి మోరే రమేష్,మదాసీ ప్రశాంత్,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.