వైన్స్ షాపులు నిర్వహించాలని డిమాండ్వైన్స్ షాపులు నిర్వహించాలని డిమాండ్

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జఫర్ఘఢ్ మండలంలో మద్యం దుకాణాల ఏర్పాటు పై స్థానిక మద్యం ప్రియులు,ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రంలో కాకుండా నల్లబండ వద్ద మద్యం దుకాణం కొనసాగుతున్నందున ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు.నల్లబండ ప్రాంతం దూరప్రాంతం కావడంతో మద్యం కోసం వెళ్లి రావడం కష్టంగా మారిందని,ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.దుకాణం దూరంగా ఉండటంతో బెల్టు షాపులు అధిక రేట్లకు విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో మద్యం ప్రియులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు,మద్యం దుకాణం కారణంగా మండల కేంద్రంలో జనసంచారం తగ్గిపోవడంతో చిన్నచిన్న దుకాణాదారులు,చిరు వ్యాపారులు అమ్మకాలు పడిపోతున్నట్లు వివరించారు.మద్యం తీసుకునేందుకు నల్లబండకు వెళ్లి వచ్చే క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మద్యం దుకాణాన్ని వెంటనే జఫర్ఘఢ్ మండల కేంద్రానికే మార్చాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *