వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని పర్వతగిరి డిప్యూటీ తహసిల్దార్ జి హారతి వినతి పత్రం సమర్పించిన సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మాదాసి యాకోబు రైతుల సంఘం మండల కన్వీనర్ జంగా మల్లికార్జున్,
వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, 130 సంవత్సరాల క్రితమే అమలులో ఉన్నటువంటి 29 కేంద్ర కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తీసుకురావడం వల్ల కార్మిక వర్గంపై ఆర్థికంగా సామాజికంగా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిందని కనీస వేతన చట్టాలను అమల్లోకి తీసుకొచ్చే పరిస్థితి లేదని సామాజిక చట్టాలైన పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతున్నాము రాష్ట్రంలో కార్మికుల హక్కుల పై ఈ విధానాల అమలు వలనతీవ్రమైన దాడి జరిగిందని కేంధ్రలోని బిజెపి ప్రభుత్వం నయ ఉదారవాద విధానాలను1991ప్రవేశపెట్టబడ్డాయని వెంటనే అమలు చేయడానికి పూనుకున్నదని పెట్టుబడిదారులు కాంట్రాక్టర్ల ప్రయోజనాలు లాభాల కోసం కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా తయారు చేసేందుకు ఈ నాలుగ లేబర్ కోర్సులు తెచ్చిందని భారత రాజ్యాంగాన్ని తక్షణమే కాపాడి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా కనీస వేతనం 26,000 నిర్ణయించాలని సమాన పనికి సమాన వేత అమలు చేయాలని నెలకు ప్రతి కార్మికునికి 9000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని వ్యవసాయ కార్మికులు అసంఘటిత కార్మికులు వివిధ రంగాల కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో అమలు చేసిన 10 గంటల విధానాన్ని రద్దుచేసి ఎనిమిది గంటలకు అమలు చేయాలని ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలని విద్యుత్ సవరణ బిల్లు 22 ఉపసంహరించుకోవాలని పని హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని ఉచిత విద్యకు ఉచిత ఆరోగ్యానిఅందరికీ గృహ నిర్మాణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మాదాసి యాకోబు, రైతు సంఘం మండల కన్వీనర్ జంగా మల్లికార్జున్, జిపి యూనియన్ మండల అధ్యక్షులు నకరకంటి రామచందర్, కెవిపిఎస్ మండల కన్వీనర్ పోడేటి దయాకర్, కౌలు రైతుల సంఘం మండల అధ్యక్షుడు బానోత్ మోహన్, డెక్క కనుకయ్య, ఈదురు వెంకన్న, నరకుడు సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *