కడియం శ్రీహరి ని కలిసిన తమ్మడపల్లి జి గ్రామ సర్పంచ్
తమ్మడపల్లి జి గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం పల్లి(జి) గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రమాణస్వీకారం చేసిన నూతన సర్పంచ్ అన్నం స్వప్న బ్రహ్మారెడ్డి సోమవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తమ్మడపల్లి(జి) గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మౌలిక వసతులు,సౌకర్యాల కల్పనకు తగిన నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ ఎమ్మెల్యేను కోరారు.దీనికి స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే ఇచ్చిన హామీకి సంతోషం వ్యక్తం చేసిన సర్పంచ్ అన్నం స్వప్న బ్రహ్మారెడ్డి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.