“మన గ్రామం-మన పరిశుభ్రత”కార్యక్రమం“మన గ్రామం-మన పరిశుభ్రత”కార్యక్రమం

జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మా రెడ్డి ఆదేశానుసారం గ్రామాన్ని పరిశుభ్రమైన,ఆరోగ్యకరమైన,ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో “మన గ్రామం-మన పరిశుభ్రత”కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అన్ని వీధులు,ప్రధాన రహదారులు,పక్క రోడ్లను శుభ్రం చేయడంతో పాటు పొదలు,ముల్లు,చెత్తను తొలగించారు.ట్రాక్టర్ సహాయంతో మట్టి సమతలీకరణ పనులు చేపట్టి,ప్రజల రాకపోకలకు అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగించారు.ఈ కార్యక్రమం వల్ల గ్రామంలో పరిశుభ్రత పెరిగి వ్యాధుల నివారణకు దోహదపడుతుందని గ్రామపంచాయతీ సభ్యులు తెలిపారు.గ్రామానికి మంచి రూపు వచ్చిందని,ప్రతి కుటుంబానికి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని,ప్రతి నెలా “మన గ్రామం-మన పరిశుభ్రత” కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *