మరిపెడ మునిసిపల్ చైర్‌పర్సన్‌గా విసరపు ప్రగతిశ్రీపాల్ రెడ్డి
వైస్ చైర్మన్‌గా కాలం సునీత రవీందర్ రెడ్డి
15 వార్డుల్లో 9 గెలిచి కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ
కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా కాలం సునీత రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరిపెడ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 9 వార్డులను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్‌కు లాంఛనప్రాయంగా మారింది. సమావేశం ప్రారంభంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి లు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మరిపెడ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెదబోయిన ఐలమల్లు, కాంగ్రెస్ నాయకులు నల్లు శ్రీకాంత్ రెడ్డి, మాజి సర్పంచ్ రామ్‌లాల్,అంబరీష,ఆఫ్జల్,అబ్సర్బ్, సురేందర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,గంధసిరి బిక్షపతి గౌడ్,గుండగని వెంకన్న గౌడ్,స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు.