సత్తుపల్లి వైస్ ఛైర్మన్ గా బొంతు సుమలత"
03 వార్డులో 270 ఓట్లతో కౌన్సిలర్ గా ఆమె గెలుపు
సత్తుపల్లి పట్టణ పురపాలక సంఘం వైస్ ఛైర్మన్ గా పట్టణంలోని 03 వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి 270 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన బొంతు సుమలత వేణు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సభా వేదికగా ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దంపతులు మట్టా రాగమయి దయానంద్ లు తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించారని,ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. వైస్ ఛైర్మన్ గా పట్టణ ప్రజలకు ప్రజా రంజక పాలన అందిస్తానని రాగద్వేషాలకు పోకుండా అందరితో కలివిడిగా ఉంటూ సుపరిపాలన అందిస్తానని స్పష్టం చేశారు.మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి చల్లగుళ్ల నరసింహారావు,కమాల్ పాషా, కౌన్సిలర్ లు కర్నాటి విజయకుమారి వెంకటనారాయణరెడ్డి,మందపాటి ప్రభాకర్ రెడ్డి,శరత్ చంద్ర,జగన్నాధం శ్రీను, దుధిపాళ్ల రాంబాబు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.