వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం
చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ గా నేతావత్ శిభారాణి ఎన్నిక
•మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ భారీ విజయోత్సవ ర్యాలీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజుచైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించినారు.వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అంతటా కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగురవేస్తూ, నినాదాలతో పట్టణం మార్మోగింది. ప్రజల ఆశీస్సులతో మున్సిపాలిటీ పీఠాన్ని గెలుచుకున్నామని, ఇది పార్టీ శ్రేణుల కృషి, కార్యకర్తల త్యాగాల ఫలితమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి అనుకూలమని, వర్ధన్నపేట పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపడతామని తెలిపారు..అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
6వార్డులో ఘన విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేపట్టిన కౌన్సిలర్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ..వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ప్రతి ఓటరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్గా ఎన్నికైన పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్గా ఎన్నికైన నేతావాత్ శిభారాణిలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.
కొంతమంది వ్యక్తులు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడి అసత్య ప్రచారాలు నిర్వహించినా ప్రజలు వాటిని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం చేశామనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తాము ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. పేద, బలహీన వర్గాల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
వర్ధన్నపేట కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయూబ్లకు, అలాగే మండలాధ్యక్షులు, పట్టణ నాయకులు, యువజన, మహిళా విభాగాల ప్రతినిధులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.వర్ధన్నపేట పట్టణ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అహర్నిశలు శ్రమించి వర్ధన్నపేటను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ పారదర్శక, ప్రజాకేంద్రిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు