ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 73వ జన్మదిన వేడుకలను భారత రాష్ట్ర సమితి మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి, మిఠాయిలు మరియు పండ్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ వేడుకల సందర్భంగా మండల అధ్యక్షుడు ఆలం సత్యనారాయణ, మండల యూత్ అధ్యక్షుడు లంగారి రవీందర్ మాట్లాడుతూ, కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.ఆయన హయాంలో పలిమేల మండలానికి కొత్తగా పరిపాలనా విభజనలు,మోదేడు నూతన గ్రామపంచాయతీ ఏర్పాట్లు, రహదారులు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు విస్తృతంగా అభివృద్ధి చెందినట్లు వివరించారు. రైతు సంక్షేమం కోసం రైతు బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ రంగానికి బలమైన అండ లభించిందని అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, రైతులు రైతు బంధు కోసం ఎదురుచూస్తున్నారని నాయకులు విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, వికలాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్ పెంపు వంటి హామీలు ఇంకా అమలులోకి రాలేదని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని వారు పిలుపునిచ్చారు.మంథని నియోజకవర్గంలోని మండలాలతో పోలిస్తే పలిమేల మండల ప్రజలు అభివృద్ధి దిశగా పనిచేసిన నాయకత్వాన్ని విశ్వసించి బిఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ ఇచ్చారని నాయకులు గుర్తుచేశారు.కార్యక్రమంలో మండల నాయకులు కుమ్మరి సారయ్య, గోమాస ఆదినారాయణ,సప్పిడి మాంతయ్య,కలుగూరి సమ్మయ్య,మోతె కిష్టయ్య,పడాల రమేష్, కమ్మల రంజిత్, మడే సత్యనారాయణ, కాల్వపల్లి వెంకటి, జనగామ రామ్మూర్తి, కుమ్మరి పోచమల్లు, యూత్ నాయకులు మోతె ప్రశాంత్, పాగె సంతోష్, బొచ్చు తిరుపతి, దుంప నరేష్, టింగ రాకేష్, గడ్డేమ్ ఉదయ్ కిరణ్, వాసం నవీన్, బాను చందర్, బాపు, రవి, కాల్వపల్లి శ్రీను, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.