ఎస్ ఎస్ ఐ టి విద్యార్థుల ఉద్యోగాల ఎంపిక
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామంలో గల సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అండ్రీ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో సాఫ్ట్ వెర్ డెవలపర్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎంపిక.సాఫ్ట్ వెర్ ఇంజనీర్ బి గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మరోక ప్రముఖ సాఫ్ట్ వెర్ కంపెనీ అయిన అండ్రీ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో సాఫ్ట్ వెర్ డెవలపర్ ఇంజనీర్ ఉద్యోగాలకు 01)కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సియస్ఈ),02)కంప్యూటర్ సైన్స్ & మెషిన్ లెర్నింగ్(సి యస్ యం),03) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ (ఏఐ & డియస్), 04)ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈసిఈ) ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు 20మంది ఎంపికైనట్లు కళాశాల సెక్రటరియేట్ & కరస్పాండెంట్ దాసరి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అండ్రీ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిదులు విద్యార్థినీ, విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించటం జరిగింది.ఈ ఇంటర్వ్యూలకు కళాశాల నుంచి 126మంది విద్యార్థినీ,విద్యార్థులు హాజరు అయినట్లు చెప్పారు. ఈ ఇంటర్వ్యూలను కంపెనీ యొక్క విధానంలో రాతపరీక్ష,టెక్నికల్ రౌండ్,హెచ్ఆర్ రౌండ్ మరియు మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజినీర్లుగా 20మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగిందని కంపెనీ ప్రతినిదులు కె.తిలక్ హెచ్ ఆర్ మేనేజర్, డి.నాగ సురేష్ సీనియర్ మేనేజర్, జె సిహెచ్.విజయ సాయి టీం లీడర్ టెక్నికల్, యం. రఘునాధ్ సీనియర్ సాఫ్ట్ వెర్ లీడర్ తెలిపారు.అనంతరం తిరిగి దాసరి మాట్లాడుతూ అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజినీర్లుగా 01)సియస్ఈ విభాగం నుంచి ౦6మంది, 02)సి యస్ యం విభాగం నుంచి 09మందిని, 03)ఏఐ & డియస్ విభాగం నుంచి 04 మందిని, 04)ఈసిఈ విభాగం నుంచి 01మందిని మొత్తం:20 మంది ఉద్యోగాలు పొందినట్లు చెప్పారు. ఈ ఇంటర్వ్యూలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో తమ కళాశాల, విద్యార్థినీ, విద్యార్థులకు మాత్రమే నిర్వహించటం జరుగుతుందని చెప్పారు. 126మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్వ్యూ లకు హాజరు అయితే మొత్తం:20 మంది సాఫ్ట్ వెర్ ఇంజనీర్ ఉద్యోగాలు పొందినట్లు చెప్పారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా సాఫ్ట్ వెర్ ఇంజినీర్లుగా కొలువులు సాధిస్తున్న పరంపరలో మరో అద్భుత అవకాశం అందిపుచ్చుకున్న తమ కళాశాల ఆణిముత్యాలు అత్యున్నత ప్రతిభ కనబరచి సాఫ్ట్ వెర్ డెవలపర్ ఇంజినీర్లుగా ఉద్యోగం సాధించారని వీరి యొక్క విద్య నైపుణ్యం క్షుణ్ణంగా పరిశీలించి వినూత్నవిషయాలపై విద్యార్థినీ, విద్యార్థులు కలిగి ఉన్న అవగాహన ద్వారా సాఫ్ట్ వెర్ డెవలపర్ ఇంజినీర్లుగా వివిధ కేటగిరిల్లో ఇంజినీర్ల ఉద్యోగానికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు.ఇంజనీరింగ్ చివరిసంవత్సరం పూర్తి అయిన వెంటనే ఉద్యోగంలో చేరవలసి ఉంటుందని ఉద్యోగాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులు హైదరాబాద్ లో ఉద్యోగం చేయవలసి ఉంటుందని వీరికి జీతం సంవత్సరానికి Rs:3.0 ఎల్ పి ఎ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త,విద్యాధికులు,హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత,రాజ్యసభ సభ్యులు మరియు సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి.పార్థసారథిరెడ్డి ,విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి.అన్విద లు వర్చువల్ గా విద్యార్థినీ, విద్యార్థినీలకు అభినందనలు తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్:వూటుకూరి శేషారత్నకుమారి విద్యార్థినీ,విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కళాశాలలో చదువుతుండగానే మంచి యంయన్ సి (ఎమ్ యన్ సి)కంపెనీలో ఉద్యోగం సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారు. కానీ ఈ పోటీ ప్రపంచంలో అది అంత ఈజీ అయిన పనికాదు. ఈ డిజిటల్ ప్రపంచంలో కేవలం సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు సాంకేతిక నైపుణ్యాలపైన మంచిపట్టు అవసరమే అలాగని క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఒక్కసారి ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడినట్లే అనుకోవచ్చు నేటి జాబ్ మార్కెట్లో కొత్త నైపుణ్యాలను ఒడిసి పట్టడంలో నిత్యం నిత్యవిద్యార్థిగా ఉండవలసిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగం కొట్టాలని ముందుగానే సన్నద్ధం అయి ఉండాలి. పోటీతత్వం పెరగడం ఏఐ(ఎ ఐ) విస్తరించడం ఉద్యోగం మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఏ ఉద్యోగం అయినా సరే నిలదొక్కుకోవడం మంచిది అందువల్ల కళాశాలలో విద్యనభ్యసిస్తుండగానే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగం కోసం ముందుగానే సన్నద్ధం అవ్వాలని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్.యాకూబ్ , కళాశాల ట్రైనింగ్&ప్లేస్ మెంట్ ఆఫీసర్ డాక్టర్:డియన్ వి కృష్ణారెడ్డి , అన్నీఇంజనీరింగ్ బ్రాంచీల విభాగాధిపతులు పాల్గొన్నారు. డిపార్ట్ మెంట్ ప్లేస్ మెంట్ ఇన్ చార్జీలు, కళాశాల ఫ్యాకల్టీ మెంబర్స్ ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థినీ,విద్యార్థులకు అభినందనలు తెలిపారు.