ఘనంగా దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దందేర రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.వేడుకల సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సేవలో దుద్దిళ్ల శ్రీనుబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న నాయకత్వం యువతకు ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండెబోయిన చిన్నన్న, మాజీ సర్పంచ్ కుమ్మరి మల్లయ్య, మాజీ సర్పంచ్ గుండెబోయిన వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ రాజలింగు, జనగామ లక్ష్మయ్య, మందుల తిరుపతి, బాడిష సారయ్య, ఎర్రవెల్లి వసంతరావు, చెన్నూరి వెంకటస్వామి, కమల శ్రీనివాస్, బండారి మధు, వేములవాడ మహేష్, బౌత్ రామచంద్రం, యూత్ నాయకులు మోతే ఉమేష్, కలుగురి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.పార్టీ పట్ల నిబద్ధతతో ప్రజల మధ్య సేవాభావంతో పనిచేయాలని నాయకులు సంకల్పం వ్యక్తం చేశారు.