సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ విద్యా, ఆరోగ్య సదుపాయాల పనితీరును మెరుగుపర్చే దిశగా మయాంక్ సింగ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడ్డాయి.తనిఖీలలో భాగంగా ఆయన ముందుగా పంకెన గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను సందర్శించి విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్‌ను స్వయంగా తనిఖీ చేసి, మెనూ ప్రకారం విద్యార్థినులకు పోషకాహారం అందించాలనే విషయంపై సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భోజన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. నివాస పాఠశాలల్లో విద్యతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా కచ్చితంగా అమలులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.అనంతరం పలిమెల మండలంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ భవనం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ) భవనాల పనుల పురోగతిని పరిశీలించారు. పనుల నాణ్యత, గడువులపై వివరాలు అడిగి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాయి పవన్, ఏఈ సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు