మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ కు సంబంధించిన వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో గంజాయి,మత్తు పదార్థాల నియంత్రణకు వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యల గురించి శాఖల వారీగా చర్చించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై వీలైనంత ఎక్కువగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించే సమావేశాల్లోను మత్తు పదార్థాల వాటిల్లే అనర్థాలపై అవగాహన కల్పించాలని డీఈవో కు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొనేలా చూడాలని అన్నారు.ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో నెలలో ఒకరోజులో కొంత సమయాన్ని మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేవిధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అన్నారు.గంజాయి, ఇతర మత్తుపదార్థాలు విక్రయించే వారి సమాచారాన్ని అందజేయాలని సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు.ఈ సమావేశంలో పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, డీఈవో ఎల్. వి. గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హనుమకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్ రెడ్డి, సతీష్ బాబు, ఎన్సీడీపీఓ డాక్టర్ శ్రీనివాస్, డీ డబ్ల్యు ఓ విశ్వజ, కేఎంసీ నుండి డాక్టర్ సంధ్య, డాక్టర్ అనిత రెడ్డి, ఎన్ఐ టీ కేయూ,ఎస్సార్ యూనివర్సిటీలతోపాటు కిట్స్, వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.