
జనగామ జిల్లా, చిల్పూరు మండలం: దేశాయి తండా సమీపంలో ఉన్న స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్లోకి ఓ షిఫ్ట్ కారు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం, స్టేషన్ ఘనపూర్ నుండి దేశాయి తండాకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టి రిజర్వాయర్లో పడింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ధారావత్ చరణ్ (18) కారు అద్దాలు పగలడంతో గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు అతన్ని రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.అయితే కారు నడుపుతున్న భూక్య పవన్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్లో శోధన కొనసాగుతోంది.